చంద్రబాబుకు రోజూ 2 లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు

  • హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చంద్రబాబుకు పలు కేసులు ఉన్నాయన్న చంద్రబాబు న్యాయవాదులు
  • న్యాయవాదులు కలిసేందుకు ప్రతి రోజు ములాఖత్ లు ఇవ్వాలని విన్నపం
  • సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు ఉన్న నేపథ్యంలో... ఆయనను న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖత్ లు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్ లు ఇవ్వనున్నారు.

మరోవైపు ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఈ పిటిషన్ పై ఇప్పుడు విచారణ అవసరం లేదని మధ్యాహ్నం కోర్టు తెలిపింది. రోజుకు ఒకసారి మాత్రమే న్యాయవాదులకు ములాఖత్ అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ములాఖత్ లు మూడుకు పెంచాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు మరోసారి పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, రోజుకు రెండు లీగల్ ములాఖత్ లకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.


More Telugu News