'రోహిత్ శర్మ అంత వేగంగా వెళ్లలేదు' అంటున్న హైవే పోలీసులు

  • రోహిత్ 215 కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడని వార్తలు
  • 105 నుంచి 117 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాడన్న హైవే పోలీసులు
  • రెండు జరిమానాలు విధించామని వెల్లడి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన లాంబోర్గిని కారును 215 కిలోమీటర్ల వేగంతో నడిపాడంటూ నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసం నుంచి పూణెలో క్రికెట్ స్టేడియంకు వెళ్తున్న సమయంలో అత్యంత వేగంతో రోహిత్ కారును నడిపాడని... ఆ కారు వేగాన్ని స్పీడ్ గన్ లు రికార్డు చేశాయనే వార్తలు వచ్చాయి. 

దీనిపై హైవే పోలీసులు స్పందించారు. రోహిత్ కారు కేవలం గంటకు 105 నుంచి 117 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించిందని వారు చెప్పారు. దీని వల్లే ఆయనకు రూ. 2 వేల చొప్పున రెండు జరిమానాలు విధించామని తెలిపారు. హైవేపై గరిష్ఠ వేగం 100 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు. చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకున్నామని... రోహిత్ ఫైన్ చెల్లించాడని తెలిపారు. రోహిత్ కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.


More Telugu News