రేపటికల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం
- దేశంలో ముగిసిన నైరుతి సీజన్
- ప్రారంభం కానున్న ఈశాన్య రుతుపవనాల సీజన్
- బంగాళాఖాతంలో నేడు ఉపరితల ఆవర్తనం
- అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానే నిష్క్రమించాయి. ఇక, దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి తగినంత వర్షపాతం ఇవ్వని నేపథ్యంలో, పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నాయి.
నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి ఇది అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు.