వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర పోరు... పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా
- బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- పాక్ తుదిజట్టులో షాదాబ్ ఖాన్ స్థానంలో ఉసామా మిర్
- ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్న ఆసీస్
భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఉసామా మిర్ లతో కూడిన బౌలింగ్ బృందంపై పాక్ సారథి బాబర్ అజామ్ గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో సీనియర్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దూరం కావడం పాక్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. షాదాబ్ స్థానంలో ఉసామా మిర్ ను తుదిజట్టులోకి తీసుకున్నట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు.
ఇక, ఆసీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచిన జట్టే ఈ మ్యాచ్ లోనూ బరిలో దిగుతున్నట్టు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాగా, భారత్, దక్షిణాఫ్రికా జట్లతో మ్యాచ్ లో ఓటమిపాలైన ఆసీస్... శ్రీలంకపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇవాళ పాకిస్థాన్ తో మ్యాచ్ లో గెలిస్తేనే ఆసీస్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.