నిద్రపోనివ్వండి.. అదే మేల్కొంటుంది.. చంద్రయాన్‌-3పై ఆశలు రేకెత్తించిన ఇస్రో చైర్మన్

  • జాబిల్లిపై 14 రోజులపాటు పనిచేసి నిద్రావస్థలోకి వెళ్లిన రోవర్ ప్రజ్ఞాన్
  • తిరిగి నిద్రలేపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
  • మైనస్ 200 డిగ్రీల వద్ద పరీక్షించినప్పుడు పనిచేసిందన్న సోమనాథ్
  • అది తిరిగి నిద్రలేచి పని ప్రారంభిస్తుందని ధీమా
జాబిల్లిపై పరిశోధనలు పూర్తిచేసి ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్-3పై ఆశలు సజీవంగానే ఉన్నట్టు ఇస్రో తెలిపింది. దానిని నిద్రలేపి పరిశోధనలకు పురమాయించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించనప్పటికీ ఇస్రో మాత్రం అది తిరిగి నిద్ర లేస్తుందనే చెబుతోంది.

కొచ్చిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ప్రజ్ఞాన్ ప్రశాంతంగా నిద్రిస్తోందని, దానిని అలాగే వదిలేద్దామని పేర్కొన్నారు. తాను తిరిగి క్రియాశీలం కావాలనుకున్నప్పుడు అదే మేల్కొంటుందని చెప్పారు. మైనస్ 200 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు తాము పరీక్షించినప్పుడు అది పనిచేసిందని తెలిపారు. ప్రజ్ఞాన్ మళ్లీ పనిచేస్తుందని తాము చెప్పడానికి అదే కారణమని సోమనాథ్ పేర్కొన్నారు.


More Telugu News