తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి షాక్.. నేడు గులాబీ గూటికి జిట్టా, రావుల
- హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న నేతలు
- వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి రావుల పోటీ!
- 14 ఏళ్ల తర్వాత సొంతగూటికి జిట్టా
తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి నేడు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రావుల మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
2009 వరకు బీఆర్ఎస్‌లోనే ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ ఎన్నికల్లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. గతేడాది బీజేపీలో చేరిన ఆయన.. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, కంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరికపై కినుక వహించిన ఆయన తిరిగి సొంతగూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల తర్వాత నేడు ఆయన తిరిగి కారెక్కబోతున్నారు.