శుభ్ మన్ గిల్ ఫోర్ కొడితే.. ఆనందంతో సారా టెండూల్కర్ చప్పట్లు
- బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన గిల్
- మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియంకు వచ్చిన టెండూల్కర్ తనయ సారా
- వైరల్ అవుతున్న సారా చీరింగ్ వీడియో
ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి మరోసారి సత్తా చాటాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, ఆ తర్వాత కోహ్లీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ను నిర్మించాడు. 55 బంతులను ఎదుర్కొన్న గిల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. మరోవైపు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసింది. ఒక ఫోర్ కొట్టిన సమయంలో చప్పట్టు కొడుతూ ఆనందాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిల్, సారా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.