మళ్లీమళ్లీ మీ ఇద్దరే కదా.. రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన కిషన్‌రెడ్డి
- ఎక్స్‌లో ఫొటో షేర్ చేసిన కిషన్‌రెడ్డి
- బీఆర్ఎస్‌లోకి మళ్లీమళ్లీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నది మీరు కాదా? అని ప్రశ్న
- కేసీఆర్ కుటుంబానికి ఘనంగా విందు ఇచ్చింది ఎవరంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే పాల్గొన్న పలు కార్యక్రమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆ పార్టీ నేత కే కేశవరావు పాల్గొన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదేపదే బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తూ ఆ పార్టీలో చేరుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
2014లో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి పంపిందని, 2018లో మరోమారు అదే పనిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పదేపదే వేదికలు పంచుకున్నాయని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రాహుల్ స్వయంగా కేటీఆర్‌తో వేదిక పంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఘనంగా విందు ఏర్పాటు చేసింది కూడా మీ కుటుంబమేనని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పదేపదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని గుర్తు చేశారు. అవినీతి, కుటుంబ పాలన, యువరాజులను పట్టాభిషిక్తులను చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒకటేనని కిషన్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు.