అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త
- 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం పెంపు
- కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు
- రేపు కనకదుర్గమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జగన్ రేపు విజయవాడ కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన ఈ నెల 20వ తేదీకి, శుక్రవారం కలిసి వచ్చింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశముంది. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.