వరల్డ్ కప్... టీమిండియా టార్గెట్ 257.. చెలరేగుతున్న రోహిత్ శర్మ

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • హాఫ్ సెంచరీలు సాధించిన బంగ్లా ఓపెనర్లు
  • భారత్ కు శుభారంభాన్ని ఇచ్చిన రోహిత్, గిల్
ప్రపంచకప్ లో భాగంగా పూణెలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 256 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లు తంజిద్ హసన్ 51 పరుగులు, లిట్టన్ దాస్ 66 పరుగులు చేసి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు. మధ్యలో భారత బౌలర్లు చెలరేగడంతో స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్ 38, మహ్ముదుల్లా 46 పరుగులు చేసి స్కోరును పెంచారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా చెరో 2 వికెట్లు తీయగా... శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు. 

257 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించింది. రోహిత్ (21), శుభ్ మన్ గిల్ (5) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 ఓవర్లకు 26 పరుగులు.


More Telugu News