చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసిన హైకోర్టు

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
  • వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేయాలని కోరిన బాబు న్యాయవాదులు  
  • బాబు లాయర్ల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేశారు. వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించారు.

హైకోర్టుల ఆదేశాల నేపథ్యంలో... దసరా సెలవుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ లో కొనసాగనుంది. మరోవైపు, హైకోర్టులో విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని... 40 రోజులుగా చంద్రబాబు విషయంలో జరుపుతున్న విచారణలో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 


More Telugu News