విదేశీ విరాళాలు సేకరించేందుకు రామజన్మభూమి ట్రస్ట్‌‌కు అనుమతి

  • విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతినిచ్చిన హోం శాఖ
  • ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన రామజన్మభూమి ట్రస్ట్
  • న్యూఢిల్లీలోని 11 సంన్సద్ మార్గ్ ఎస్బీఐ బ్రాంచ్‌లోనే విరాళాలు జమ చేయాలని సూచన
విదేశాల నుంచి విరాళాల సేకరణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు హోం శాఖ అనుమతి లభించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద హోం శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్టు ట్రస్ట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 11 సంన్సద్ మార్గ్ బ్రాంచ్‌లోని ట్రస్ట్ అకౌంట్లలో విరాళాలు జమ చేయవచ్చని పేర్కొంది. ఈ అకౌంట్ మినహా మరే ఇతర బ్రాంచీల్లోనూ విదేశీ విరాళాలు అందించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 

కాగా, అయోధ్య రామ మందిరం తొలి దశ నిర్మాణం ఈ డిసెంబర్‌లో పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరిలో గుడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.


More Telugu News