ఆన్‌లైన్ ఆటలతో కోటిన్నర గెలుచుకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు
- ఫాంటసీ గేమింగ్ యాప్ డ్రీమ్11లో బెట్టింగ్‌తో కోటిన్నర గెలిచిన మహారాష్ట్ర ఎస్సై సోమ్‌నాథ్
- విధుల్లో ఉండి బెట్టింగ్‌కు దిగినందుకు ఎస్సైపై ఉన్నతాధికారుల ఆగ్రహం
- పోలీసు శాఖ పరువు తీసినందుకు సస్పెన్షన్ వేటు
ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫాం డ్రీమ్ 11లో బెట్టింగ్‌తో కోటిన్నర గెలుచుకున్న ఓ ఎస్సైపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి పోలీస్ శాఖ పరువుకు భంగం కలిగించినందుకు విధుల నుంచి సస్పెండ్ చేసిన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలోని పింప్రీ-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే ఎస్సై సోమ్‌నాథ్ అక్టోబర్ 10న విధుల్లో ఉండి ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని పేర్కొన్నారు. అతడిపై ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఎస్సైపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.
సోమ్‌నాథ్ గత మూడు నెలలుగా డ్రీమ్11లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గొప్ప ఆటగాళ్లతో ఓ డ్రీమ్ టీం నిర్మించుకుని గెలుపొందారు. ఈ క్రమంలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. ఒక్కసారిగా అంత డబ్బు వచ్చినందుకు ఎస్సై కుటుంబమంతా సంబరాలు చేసుకోగా ఉన్నతాధికారుల చర్యలతో వారికి భారీ షాక్ తగిలింది.