దేశంలో భారీగా న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు... ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు

  • 16 మంది న్యాయమూర్తుల బదిలీ
  • 17 మంది న్యాయమూర్తుల నియామకం
  • వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
దేశంలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు చేపట్టారు. 16 మంది న్యాయమూర్తులను బదిలీ చేయగా, 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ఈ మేరకు కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. 

ఈ ప్రక్రియలో ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిలను నియమించారు. ఇప్పటివరకు న్యాయవాదులుగా ఉన్న న్యాపతి విజయ్,  హరినాథ్ నూనేపల్లి, సుమతి జగడం, కిరణ్మయి మండవ ఇకమీదట ఏపీ హైకోర్టులో అడిషనల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక, కర్ణాటక హైకోర్టు నుంచి న్యాయమూర్తి జి.నరేందర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. 

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్ ని గుజరాత్ హైకోర్టుకు, అడిషనల్ జడ్జి దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు నుంచి మున్నూరి లక్ష్మణ్ ను రాజస్థాన్ హైకోర్టుకు, జి.అనుపమ్ చక్రవర్తిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. 

నూతనంగా నియమితులైన ఇతర జడ్జిల వివరాలు...

1. అభయ్ జైనారాయణ్ జీ మంత్రి- అడిషనల్ జడ్జి, బాంబే హైకోర్టు
2. శ్యామ్ చగన్ లాల్ చందక్- అడిషనల్ జడ్జి, బాంబే హైకోర్టు
3. నీరజ్ ప్రదీప్ ధోతే- అడిషనల్ జడ్జి, బాంబే హైకోర్టు
4. జాన్సన్ జాన్- అడిషనల్ జడ్జి, కేరళ హైకోర్టు
5. గోపీనాథన్.యు.గిరీశ్- అడిషనల్ జడ్జి, కేరళ హైకోర్టు
6. సి.ప్రదీప్ కుమార్- అడిషనల్ జడ్జి, కేరళ హైకోర్టు
7. షాలిందర్ కౌర్- అడిషనల్ జడ్జి, ఢిల్లీ హైకోర్టు
9. రవీందర్ దుదేజా- అడిషనల్ జడ్జి, ఢిల్లీ హైకోర్టు
10. రవీంద్ర కుమార్ అగర్వాల్- అడిషనల్ జడ్జి, చత్తీస్ గఢ్ హైకోర్టు
11. విమల్ కన్నయ్యాలాల్ వ్యాస్- జడ్జి, గుజరాత్ హైకోర్టు
12. కేవీ అరవింద్- అడిషనల్ జడ్జి, కర్ణాటక హైకోర్టు
13. సవ్యసాచి దత్తా పురకాయస్త- జడ్జి, త్రిపుర హైకోర్టు
14. బిశ్వజిత్ పాలిత్- అడిషనల్ జడ్జి, త్రిపుర హైకోర్టు

బదిలీ అయిన ఇతర న్యాయమూర్తులు వీరే...

1. ఎస్పీ కేశర్వాణి- అలహాబాద్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ
2. రాజ్ మోహన్ సింగ్- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
3. సుధీర్ సింగ్- పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ
4. ఎంవీ మురళీధరన్- మణిపూర్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ
5. మధురేశ్ ప్రసాద్- పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ
6. అర్వింద్ సింగ్ సంగ్వాన్- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
7. అవనీశ్ జింగాన్- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ
8. అరుణ్ మోంగా- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ
9. ఐవీ రాజేంద్రకుమార్- అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
10. నాని తగియా- గౌహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ
11. లపితా బెనర్జీ- కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ



More Telugu News