చంద్రబాబు పీటీ వారెంట్... ఏసీబీ కోర్టు నిర్ణయం 20కి వాయిదా

  • ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా
  • చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి ఉండటంతో మెమో దాఖలు
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంతో కోర్టు నిర్ణయం వాయిదా పడింది.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోగా టీడీపీ అధినేతను అరెస్ట్ చేయవద్దని కూడా సీఐడీ తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News