మైదానంలో నమాజ్ చేయాలని రిజ్వాన్ ను ఎవరు కోరారు?: పాక్ మాజీ క్రికెటర్

  • భారత్ పై విమర్శలను తప్పుబట్టిన పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
  • ఎదుటి వారి లోపాలు ఎంచడం కాదంటూ హితవు
  • తమ వైపు లోపాలను సరి చేసుకోవాలని పీసీబీకి సూచన
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వ్యవహార శైలిని పాక్ మాజీ క్రికెటర్ అయిన డానిష్ కనేరియా తప్పుబట్టాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 14న భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ బృందం పట్ల ప్రేక్షకులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కనేరియా మండిపడ్డాడు. పీసీబీ ఇతరుల వైపు తప్పులు ఎంచుతోందే కానీ, తన వైపు లోపాలను గుర్తించడం లేదని విమర్శించాడు. 

‘‘ఇండియాకు, హిందువులకు వ్యతిరేకంగా పాకిస్థానీ జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్ ను ఎవరు వ్యాఖ్యలు చేయమన్నారు? ఐసీసీ ఈవెంట్ ను బీసీసీఐ ఈవెంట్ అంటూ మైక్ ఆర్థర్ ను ఎవరు కామెంట్ చేయమన్నారు? మైదానంలో నమాజ్ చేయాలంటూ రిజ్వాన్ ను ఎవరు కోరారు? ఎదుటి వారిలో తప్పులు ఎంచకు’’ అంటూ డానిష్ కనేరియా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పీసీబీ వ్యవహారశైలిని తప్పుబ్టటారు. ఐసీసీ వద్ద ఫిర్యాదు చేసినట్టుగా పీసీబీ చేసిన పోస్ట్ ను కూడా జత చేశాడు.


More Telugu News