ఐదు వారాల్లోనే సిక్స్ ప్యాక్.. సాధించిన హృతిక్ రోషన్!
- ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్
- అబ్బుర పడుతున్న నెటిజన్లు, నెట్టింట ఫొటోలు వైరల్
- సినిమాలో తన క్యారెక్టర్లకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటానన్న స్టార్ హీరో
ఫిట్‌నెట్‌కు పర్యాయపదంగా ఉండే కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా అప్పుడప్పుడూ ఆటవిడుపుగా కసరత్తులను పక్కనబెడుతుంటాడు. మళ్లీ షూటింగ్ మొదలయ్యే నాటికి మునుపటి హృతిక్ లా మారిపోతాడు. అయితే, ఈ సారి కేవలం ఐదు వారాల్లోనే ఆయన పోయిన సిక్స్ ప్యాక్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆగస్టు 31న కాస్తంత పొట్టతో బొద్దుగా కనిపించిన హృతిక్ అక్టోబర్ 7 కల్లా సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. ఈ ప్రయాణాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ నెట్టింట ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
‘‘ఐదు వారాలు..
ప్రారంభం నుంచి ముగింపు వరకూ..
సెలవుల తరువాత.. షూటింగ్ తరువాత..
మిషన్ పూర్తి చేశా..
ఈ మిషన్‌లో మోకాళ్లు, భుజాలు, వెన్ను మెదడు అన్నీ సహకరించాయి. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుని కోలుకుని, కొత్త సమతౌల్యం సాధించాల్సిన సమయం వచ్చింది.
ఈ జర్నీలో అత్యంత కష్టమైన పని.. ఫ్రెండ్స్, బంధువులు, పార్టీలకు నో చెప్పడం
రాత్రి 9 కల్లా నిద్రకు ఉపక్రమించడం కూడా ఓ మోస్తరు ఇబ్బందే.
క్రిస్ గెథిన్ లాంటి మెంటార్ దొరకడం నిజంగా అద్భుతం. ఆయన అనుభవం, నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడ్డాయి.
ఇక స్వప్నిల్ హజారే లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నా టీంకి కూడా ధన్యవాదాలు. వారు వెన్నంటి ఉండటంతోనే అనుకున్నది సాధించా’’ అంటూ హృతిక్ ఇన్‌స్టాలో ఓ ట్వీట్ చేశాడు.
సినిమాలోని తన క్యారెక్టర్ అవసరాలకు తగ్గట్టు శారీరక దారుఢ్యాన్ని మార్చుకుంటానని హృతిక్ చెప్పుకొచ్చాడు. తన సెల్ఫ్ వర్త్ తన రూపురేఖలపై ఆధారపడి ఉండదని కూడా స్పష్టం చేశాడు .