దినసరి కూలీ అకౌంట్లో అకస్మాత్తుగా రూ.200 కోట్లు
- ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా బతానియా గ్రామంలో ఘటన
- కూలీ అకౌంట్లో అకస్మాత్తుగా రూ.200 కోట్ల జమ
- ఆదాయపు పన్ను శాఖ నోటీసులు, రూ.4.58 లక్షలు ట్యాక్స్ కింద డెబిట్
- 2019లోనే తన పాన్ కార్డు పోయిందన్న బాధితుడు
- ఆ కార్డుతో బ్యాంక్ ఖాతా తెరిచి ఎవరో అక్రమ లావాదేవీలు జరిపారని పోలీసులకు ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ దినసరి కూలీ అకౌంట్లో ఏకంగా రూ.200 కోట్లు జమ కావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా, ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసు కూడా జారీ చేయడం అతడికి తలనొప్పిగా మారింది.
బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ ఢిల్లీలో దినసరి కూలీగా పనిచేస్తుంటాడు. ఇటీవల, భారీ మొత్తం తన అకౌంట్లో జమ కావడంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను కింద రూ.4.58 లక్షలు కోత పడ్డ విషయాన్ని కూడా చెప్పాడు. 2019లో తన పాన్ కార్డు పోయిందని వివరించాడు. ఈ కార్డు సాయంతోనే ఎవరో తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచి అక్రమలావాదేవీలు జరిపి ఉంటారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.