చంద్రబాబు ఆరోగ్య నివేదిక... ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక కోరుతూ న్యాయవాదుల పిటిషన్
- ఈ రోజు సాయంత్రం కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
- రేపు విచారణకు వచ్చే అవకాశం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మంగళవారం సీఐడీ... కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సీఐడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు విచారణకు రానుంది. ఇరువైపుల వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
ఇదిలా ఉండగా ఫైబర్ నెట్ కేసులో కూడా సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచవద్దని సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనలను సీఐడీ అధికారులు మెమో రూపంలో ఏసీబీ కోర్టుకు సమర్పించారు.