నెదర్లాండ్స్ బౌలర్ల విజృంభణ... 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • ధర్మశాలలో మ్యాచ్
  • వర్షం వల్ల మ్యాచ్ ప్రారంభం ఆలస్యం... 43 ఓవర్లకి కుదింపు
  • మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్... 8 వికెట్లకు 245 పరుగుల స్కోరు
  • లక్ష్యఛేదనలో తడబాటుకు గురైన సఫారీ టాపార్డర్
వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి! ఇవాళ ధర్మశాలలో వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో... మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. అయితే, లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే కుదుపులకు గురైంది. 

దక్షిణాఫ్రికా 11.2 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ టెంబా బవుమా 16, క్వింటన్ డికాక్ 20, వాన్ డర్ డుస్సెన్ 4, ఐడెన్ మార్ క్రమ్ 1 పరుగు చేసి వెనుదిరిగారు. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (28), డేవిడ్ మిల్ంలర్ (18 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న దశలో వాన్ బీక్ బౌలింగ్ లో క్లాసెన్ అవుటయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ చేజార్చుకుంది. అప్పటికి జట్టు స్కోరు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 89 పరుగులు.

డచ్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వాన్ డెర్ మెర్వ్ 2 వికెట్లు, వాన్ బీక్ 1, అకెర్ మన్ 1, వాన్ మీకెరెన్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో మిల్లర్, మార్కో యాన్సెన్ ఉన్నారు. దక్షిణాఫ్రికా గెలవాలంటే ఇంకా 157 పరుగులు చేయాలి


More Telugu News