మాజీ సీఎంను కలిసేందుకు స్కూటర్‌పై వెళ్లిన రాహుల్ గాంధీ
- మిజోరాంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
- విపక్షాల ఇండియా కూటమి దేశంలో 60 శాతం ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తోందన్న రాహుల్
- మిజోరాం ప్రజలు భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలని పిలుపు
తాము అధికార వికేంద్రీకరణను నమ్ముతామని, బీజేపీ మాత్రం ఢిల్లీలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరాంలోని ఐజ్వాల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విపక్షాల I.N.D.I.A. కూటమి దేశంలోని అరవై శాతం మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. మతాలు, సంస్కృతులతో సంబంధం లేకుండా ప్రజల స్వేచ్ఛ, సామరస్యం, రాజ్యాంగ విలువలను కాపాడటం ద్వారా దేశ భావనను తమ కూటమి కాపాడుతుందన్నారు.
ఈశాన్య భారత్‌లోని వివిధ రాష్ట్రాలు బీజేపీ నుంచి దాడులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. మిజోరాం ప్రజలు తమ స్వేచ్ఛ, విశ్వాసాలు, సంప్రదాయాలు, భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిజోరాంపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇక్కడి ఎంఎన్ఎఫ్, జెడ్‌పీఎంలను ఉపయోగించుకుంటోందన్నారు. మణిపూర్‌లో రెండు వర్గాలను కలపాల్సి ఉందన్నారు. కాగా, మిజోరాం మాజీ ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాను కలిసేందుకు రాహుల్ గాంధీ స్కూటర్ పైన వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.