'భగవంత్ కేసరి'తో బాలయ్యకి దక్కనున్న హ్యాట్రిక్ హిట్!

  • నేలకొండ భగవంత్ కేసరి'గా బాలయ్య
  • తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ  
  • అనిల్ రావిపూడి టేకింగ్ పై అందరిలో నమ్మకం 
  • తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల    
మొదటి నుంచి కూడా బాలకృష్ణ తన సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఒకదశ తరువాత ఆ రెండూ మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. 'అఖండ' .. 'వీరసింహా రెడ్డి' సినిమాల విషయంలోను ఈ సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేశాయి. 

ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'భగవంత్ కేసరి' రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో 'నేలకొండ భగవంత్ కేసరి' అనే పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. పాత్ర పరంగా కూడా NBK వచ్చేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేయడం విశేషం. ఇంతవరకూ ఫ్లాప్ మాట వినని ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలయ్య పవర్ఫుల్ రోల్ .. కాజల్ జోడీగా ఆయన చేసే సందడి .. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ పరంగా నడిచే డ్రామా .. కూతురుగా శ్రీలీల చేసే అందమైన అల్లరి .. తమన్ ట్యూన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది. 



More Telugu News