స్వలింగ వివాహాలకు ఎందుకు అనుమతించాలి? పిటిషనర్ల వాదనలు ఇవీ..!

  • సమానత్వం, సమన్యాయం కిందకే స్వలింగ వివాహాలు వస్తాయన్న వాదన
  • ప్రతి వ్యక్తికీ తన వివాహాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని డిమాండ్
  • స్వలింగ వివాహాలను నిరాకరించడం హక్కుల ఉల్లంఘనేనన్న పిటిషనర్లు
ఒకే లింగానికి చెందిన ఇద్దరు వివాహం చేసుకోవడం అన్నది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనది. కానీ, స్వలింగ సంపర్కులు తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని పార్లమెంటు అభీష్టానికే విడిచిపెడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలవరించింది. తమ వివాహాలకు ఎందుకు చట్టపరమైన గుర్తింపు కావాలనే దానికి పిటిషనర్లు సుప్రీంకోర్టు ముందు చేసిన వాదనలు ఇలా ఉన్నాయి.

వాదనలు
  • సమానత్వం, సమన్యాయం కింద చట్టబద్ధత కల్పించాలి.
  • ప్రతి వ్యక్తికీ వారి లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ప్రేమించే హక్కు అంతర్గతంగా ఉంటుంది.
  • స్వలింగ వివాహాలను నిషేధించడం అన్నది ఎల్ జీ బీటీ క్యూ ప్లస్ కమ్యూనిటికి రాజ్యంగం కల్పించిన హక్కుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది.
  • భిన్నమైన లైంగిక ధోరణులకు సమాజం, ప్రభుత్వపరమైన గుర్తింపు అవసరం.
  • స్వలింగ వివాహాలను నిరాకరించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది.
  • వివాహం అన్నది వ్యక్తిగత ఎంపిక స్వేచ్ఛ కిందకు వస్తుంది. దీన్ని సమాజం, చట్టాలు నిర్ణయించకూడదు. 
  • హోమోసెక్సువల్ జంటలు అనుభవిస్తున్న చట్టపరమైన రక్షణలు స్వలింగ వివాహాలకు కూడా ఉండాలి.
  • రాజ్యాంగం మంజూరు చేయబడిన చట్టం కింద స్వలింగ జంటలకు సమాన హక్కులు ఉండాలి.
  • ఎల్ జీబీటీక్యూ ప్లస్ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను ప్రస్తావిస్తూ.. దీన్ని ఎదుర్కోవడానికి స్వలింగ వివాహం పరిష్కారంగా న్యాయవాదులు పేర్కొన్నారు.
  • ఆమోదం లేకపోవడం, వివక్ష కారణంగా ఎదుర్కొనే మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • దత్తత తీసుకోవడం, కుటుంబాన్ని కలిగే హక్కు స్వలింగ జంటలకు కల్పించాలి.
  • స్వలింగ సంపర్క జంటలకు ప్రస్తుత చట్టం ఆర్థిక ప్రయోజనాలను నిరాకరిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
  • మారుతున్న ప్రపంచ ధోరణులు, స్వలింగ వివాహాలకు లభిస్తున్న ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 
  • స్వలింగ వివాహం వివాహ వ్యవస్థను బలహీనపరుస్తుందన్నది సరికాదు.
  • చట్టపరమైన గుర్తింపు ద్వారానే సామాజిక చెల్లుబాటు లభిస్తుంది.
  • గౌరవంగా జీవించే హక్కు కల్పించాలి.


More Telugu News