తెలంగాణ గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా.. దసరా తరువాత!
- గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదలపై టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం
- అభ్యర్థుల మార్కులు, జిల్లా స్థానికత వంటి అంశాలతో త్వరలో జాబితా విడుదల
- మహిళలకు సమాంతర రిజర్వేషన్‌పై హైకోర్టు స్పష్టత అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటన
తెలంగాణలో గ్రూప్-4 సర్వీసు పోస్టుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్‌సీ సిద్ధమైంది. దసరా తరువాత ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. అభ్యర్థుల మార్కులు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ లిస్ట్‌లో వుంటాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌పై హైకోర్టు స్పష్టతనిచ్చాక, ఎన్నికల కోడ్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితా ప్రకటిస్తుంది.
జులై 1న నిర్వహించిన గ్రూప్-4 రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7.6 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఆ తరువాత పరీక్షకు సంబంధించి తుది కీ వెల్లడించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్-1లో ఏడు, పేపర్-2లో మూడు ప్రశ్నలు తొలగించింది. మరో 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. తుది కీ వెల్లడి తరువాత అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి చేసింది.