వరల్డ్ కప్: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ కు వర్షం అంతరాయం
- వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ శ్రీలంక
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 32.1 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు
- వర్షం రావడంతో నిలిచిన మ్యాచ్
- రెండేసి వికెట్లతో లంకను దెబ్బతీసిన కమిన్స్, జంపా
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోగా, వర్షం అంతరాయం కలిగించింది.
వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి శ్రీలంక 32.1 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా తొలి వికెట్ కు 125 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, శ్రీలంక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కుశాల్ పెరీరా 82 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 78 పరుగులు చేయగా, నిస్సాంక 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరినీ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చగా... ఆ తర్వాత కుశాల్ మెండిస్ (9), సదీర సమరవిక్రమ (8)లను జంపా అవుట్ చేశాడు. దాంతో లంక కొన్ని ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు చేజార్చుకుంది.
ప్రస్తుతం క్రీజులో చరిత్ అసలంక (4 బ్యాటింగ్), ధనంజయ డిసిల్వా (7 బ్యాటింగ్) ఉన్నారు. వర్షం శాంతించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది.