ఆ అడ్డంకి దాటితే చాలు... కప్ టీమిండియాదే: షోయబ్ అక్తర్

  • వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్
  • పాక్ చిన్న పిల్లల జట్టులా కనిపించిందన్న అక్తర్
  • వరల్డ్ కప్ లో టీమిండియా సరైన పంథాలో వెళుతోందని వెల్లడి
  • 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేస్తుందని వ్యాఖ్యలు
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై చిరస్మరణీయ విజయం సాధించడం తెలిసిందే. తొలుత పాకిస్థాన్ ను 191 పరుగులకు కట్టడి చేసి, ఆపై అద్భుతరీతిలో విజయలక్ష్యాన్ని అందుకుంది. తద్వారా తాజా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టును టీమిండియా అన్ని రంగాల్లో చిత్తు చేసిందని అన్నాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టిందని పేర్కొన్నాడు. టీమిండియా ముందు పాక్ ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని అక్తర్ విమర్శించాడు. పాక్ అంత  దారుణంగా ఓటమిపాలవడాన్ని తాను చూడలేకపోయానని తెలిపాడు. 

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా సరైన పంథాలో వెళుతోందని అన్నాడు. సెమీఫైనల్ అడ్డంకి దాటితే వరల్డ్ కప్ టీమిండియాదేనని అక్తర్ నమ్మకం వ్యక్తం చేశాడు. 2011 నాటి ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేయడం ఖాయంగా కనిపిస్తోందని వెల్లడించాడు.


More Telugu News