కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
  • కాంగ్రెస్‌లో అవమానాలకు గురయ్యానన్న పొన్నాల
  • జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారని ప్రశంస
  • జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం జనగామలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు అవమానాలకు గురయ్యానన్నారు. 

ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేయించారన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 

జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. జనగామలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు.


More Telugu News