మియాపూర్ లో 27 కిలోల బంగారం పట్టివేత
- భారీ మొత్తంలో వెండి ఆభరణాలు కూడా..
- పోలీసుల తనిఖీలలో బయటపడ్డ బంగారం
- బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నగదు అక్రమ తరలింపును అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టారు. సోమవారం మియాపూర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో భారీగా బంగారం బయటపడింది.
అక్రమంగా తరలిస్తున్న 27.540 గ్రాముల బంగారం, 15.650 కిలోల వెండిని గుర్తించారు. ఈ ఆభరణాలకు సంబంధించి బిల్లులు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.