గాజా శ్మశానాలలో చోటు లేక మృతదేహాలను ఐస్ క్రీం బండ్లలో పెడుతున్న వైనం.. వీడియో ఇదిగో!

  • ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో చనిపోతున్న పౌరులు
  • ఇప్పటి వరకు 2,600 మంది పాలస్తీనియన్లు మృతి
  • ఆసుపత్రుల్లో నిండిపోయిన మార్చురీలు
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ఆహారం, నీళ్ల సప్లై ఆపేయడంతో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం గగనంగా మారింది. ఇదిలా ఉండగా.. బాంబు దాడుల్లో చనిపోయిన వారితో శ్మశానాలు నిండిపోయాయి. గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో చాలామంది కన్నుమూస్తున్నారు. మందుల కొరత వల్ల ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆసుపత్రుల్లోని మార్చురీలు కూడా శవాలతో నిండిపోయాయి. అటు శ్మశానాలు ఫుల్.. ఇటేమో మార్చురీలలో ఖాళీ లేదు.. ఈ పరిస్థితుల్లో డెడ్ బాడీలను ఐస్ క్రీం బండ్లలో స్టోర్ చేస్తున్నట్లు వైద్యులు వివరించారు.

ఆసుపత్రి బయట పార్క్ చేసిన ఓ ఐస్ క్రీం వ్యాన్ లో పలు మృతదేహాలను ఉంచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పాలస్తీనా జర్నలిస్టు ఒకరు ఆ వ్యాన్ ముందు నిలుచుని రిపోర్ట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐస్ క్రీం బండి కావడంతో ప్రచారం కోసం ఆ వ్యాన్ పై సదరు కంపెనీ ఐస్ క్రీంలు, వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారి ఫొటోలు ఉండగా.. బండి లోపలున్న ఫ్రీజర్ లో పదుల సంఖ్యలో మృతదేహాలు ఉన్నాయని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు.


More Telugu News