హిందువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెనడా ప్రధాని
- సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్యకు భారత సీక్రెట్ ఏజెంట్లు కారణమని కెనడా ప్రధాని ఆరోపణ
- కెనడా తీరుపై భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన ప్రధాని
- భారత్‌తో వివాదం పెద్దది చేయదలుచుకోలేదంటూ గతంలో ప్రకటన
- హిందువులందరికీ తాజాగా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైనం
భారత్‌తో దౌత్యవివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు నవరాత్రి వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ నవరాత్రి’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
కెనడాలో సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య వెనకాల భారత సీక్రెట్ ఏజెంట్‌ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని పెను వివాదాన్ని రాజేసిన విషయం తెలిసిందే. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. కెనడా తీరుకు నిరసనగా అక్కడి వారికి భారత వీసాల జారీని నిలిపివేసింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలని కూడా అక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కొందరిని కెనడా ప్రభుత్వం వెనక్కు కూడా పిలిపించుకుంది. అనంతరం, కెనడా ప్రధాని మరో ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదాన్ని పెద్దది చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ వివాదం కారణంగా సొంతదేశంలోనే కెనడా ప్రధాని పాప్యులారిటీ పడిపోయింది.