ఏపీ సీఎం జగన్ సక్సెస్ ఫుల్ గా పెంచుకుంటూ పోయారు... మేం కూడా పెంచుకుంటూ పోతాం: తెలంగాణ సీఎం కేసీఆర్

  • ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్
  • ఆసరా పింఛన్ల పెంపు ప్రకటించిన వైనం
  • ఏడాదికి రూ.500 చొప్పున పెంచుతూ రూ.5 వేలు చేస్తామని వెల్లడ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో, ఆసరా పింఛన్లను ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంచుతామని పేర్కొన్నారు.ఈ అంశం ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రస్తావన తీసుకువచ్చారు. 

"నాడు తెలంగాణలో మేము... ఏపీలో సీఎం జగన్ ఈ స్కీమ్ రూ.2000తో ప్రారంభించి ముందుకు తీసుకెళ్లాం. ఏపీలో ఈ పెన్షన్ పథకం చాలా విజయవంతంగా అమలైంది. మేం ఇక్కడ పింఛను వెయ్యి రూపాయలు పెంచి రూ.3 వేలు చేస్తాం. అక్కడ్నించి ఏటా రూ.500 పెంచుతూ నాలుగేళ్లలో రూ.5 వేలు చేస్తాం. ఇలా చేయడం వల్ల  ప్రభుత్వంపై భారం పడదు. ఎలాగూ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది కాబట్టి దీన్ని చక్కగా అమలు చేస్తాం" అని సీఎం జగన్ వివరించారు.


More Telugu News