భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్... వీడియో ఇదిగో!
- అహ్మదాబాద్ లో నిన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం
- ఓ ప్రేక్షకుడికి, మహిళా పోలీసుకు మధ్య వాగ్వాదం
- ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించిన పోలీసు
- పోలీసుపై చేయి విసిరిన ప్రేక్షకుడు... వీడియో వైరల్
అహ్మదాబాద్ లో నిన్న దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులకు వందశాతం వినోదం అందించిన మ్యాచ్ ఇది. ఈ పోరుకు వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.32 లక్షలు కాగా, స్టేడియం మొత్తం నిండిపోయింది.
అయితే, ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా, స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కు, ప్రేక్షకుడికి మధ్య బాహాబాహీ జరిగింది.
ఏదో అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా మహిళా పోలీసు ఒక్కసారిగా ఆ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించింది. దాంతో అతడు కూడా మహిళా పోలీసుపై చేయి విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.