వరల్డ్ కప్ లో ఇవాళ ఇంగ్లండ్ తో ఆఫ్ఘన్ ఢీ

  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసిన ఆఫ్ఘన్
భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ నిలకడైన బ్యాటింగ్ తో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 29, ఇబ్రహీం జాద్రాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ వోక్స్, రీస్ టాప్ లే, శామ్ కరన్ కొత్త బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.


More Telugu News