కేసీఆర్ తో తలపడే అభ్యర్థిపై కాంగ్రెస్ సస్పెన్స్

  • కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్
  • ఆ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ పార్టీ
  • 55 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల
  • కామారెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న షబ్బీర్ అలీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుంచి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి భట్టి విక్రమార్క.. బరిలో ఉంటారని ఫస్ట్ లిస్ట్ లో వెల్లడించింది. వీరితో పాటు మొత్తం 55 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 12 మంది కొత్త వారే ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

ఈసారి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. తొలి జాబితాలో ఈ పేరు లేదు. కామారెడ్డి టికెట్ కోసం ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో గడిచిన కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేదు, అలాగే కామారెడ్డి నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో కామారెడ్డి టికెట్ షబ్బీర్ అలీకే ఇస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు.


More Telugu News