హైదరాబాద్‌లో ఖాళీ అవుతున్న కోచింగ్ సెంటర్లు.. సొంతూళ్లకు నిరుద్యోగుల క్యూ
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన పోటీ పరీక్షలు
- మరో మూడు నాలుగు నెలలపాటు పోటీ పరీక్షలు లేనట్టే
- బోసిపోతున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు
- మళ్లీ వచ్చేది అనుమానమేనంటున్న ఉద్యోగార్థులు
పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఉద్యోగార్థులు ఇప్పుడు నగరాన్ని వీడుతున్నారు. పరీక్షలు వాయిదా పడడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో రెండుమూడు నెలలపాటు ఎలాంటి పోటీ పరీక్షలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని నెలలపాటు ఊరికనే ఇక్కడ ఉండి కన్నవాళ్లకు భారం కాకూడదన్న ఉద్దేశంతో హాస్టళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో ఇన్నాళ్లు కళకళలాడిన స్టడీ సెంటర్లు, హాస్టళ్లు బోసిపోతున్నాయి.
కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన నిరుద్యోగులు నెలకు దాదాపు రూ. 12 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇక్కడ ఉండడం వల్ల ఆర్థిక భారం తప్ప మరేమీ ఉండదని చెబుతూ మూటముళ్లె సర్దుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది నగరాన్ని వీడారు. ఇలా వెళ్తున్న వారిలో చాలామంది తమకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదని, ఇక్కడకొచ్చి ఉద్యోగానికి ప్రిపేర్ కావడం కంటే ఊర్లో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగుచేసుకోవడం మేలని చెబుతున్నారు.