దసరా సెలవుల కోసం ఇంటికొచ్చి గుండెపోటుతో మరణించిన ఏడో తరగతి బాలిక
- నిజామాబాద్‌లో ఘటన
- మోపాల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక
- సెలవులకు ఇంటికొచ్చి చాతీలో నొప్పిగా ఉందన్న విద్యార్థిని
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు బాగా ఎక్కువయ్యాయి. శారీకంగా దృఢంగా ఉన్నవారితోపాటు చిన్నారులను కూడా గుండెపోటు కబళిస్తోంది. తాజాగా ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి ఏడో తరగతి చదువుతోంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి చాతీలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే బాలిక మరణించినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.