కోహ్లీ జెర్సీ తీసుకున్న బాబర్ పై వసీం అక్రమ్ ఫైర్
- టీవీ కెమెరాల ముందు అలా చేయాల్సింది కాదని విమర్శ
- బహుమతి తీసుకునే సమయం కాదని వ్యాఖ్య
- డ్రెస్సింగ్ రూమ్ లో అడిగి తీసుకుంటే సరిపోయేదన్న అక్రమ్
వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుపై పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక మైదానంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ జట్టు కెప్టెన్ చేసిన పనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మండిపడుతున్నాడు. ఓవైపు జట్టు ఓటమితో అభిమానులు బాధపడుతుంటే బాబర్ అలా చేసి ఉండాల్సింది కాదని విమర్శిస్తున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
మ్యాచ్ ముగిశాక బాబర్ అజామ్ వెళ్లి కోహ్లీని కలిశాడు. కోహ్లీ జెర్సీని అడిగితీసుకున్నాడు. తన బంధువుల పిల్లాడు కావాలన్నాడని బాబర్ చెప్పడంతో కోహ్లీ తన జెర్సీని సంతకం చేసి అందించాడు. ఇదంతా మైదానంలోనే జరిగింది. దీంతో కెమెరాల ఫోకస్ మొత్తం వారిద్దరిపైనే ఉంది. టీవీల్లో కూడా ఇదే క్లిప్ పదే పదే ప్రసారమైంది. దీనిపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఓ డిబేట్ లో స్పందించారు. జట్టు విఫలమైన సమయంలో చేయాల్సిన పని కాదంటూ బాబర్ పై మండిపడ్డారు. కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్ లో కలిసి, జెర్సీ తీసుకుని ఉండాల్సిందని చెప్పారు.