దసరా రద్దీ తట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు
- కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు సర్వీసు
- 19,26 తేదీల్లో కాచిగూడ నుంచి రాత్రి 8.30 గంటలకు ప్రయాణం
- 20,27 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 5.10 గంటలకు తిరుగుప్రయాణం
దసరా రద్దీ తట్టుకునేలా కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలు రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. మళ్లీ ఈ నెల 20,27, తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.