శ్రీకాళహస్తిలో చీకట్లోనే సర్పదోష నివారణ పూజలు
- మహాలయ అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
- మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల అవస్థలు
మహాలయ అమావాస్య, రెండో శనివారం కావడంతో నిన్న శ్రీకాళహస్తీర్వుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చాక మాత్రం తీవ్ర అవస్థలు పడ్డారు. చీకట్లోనే పూజలు చేయించుకోవాల్సి వచ్చింది.
మరమ్మతుల కోసం కరెంటు సరఫరా నిలిపివేసిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో భక్తులు సర్పదోష నివారణ పూజలు చీకట్లోనే చేయించుకున్నారు. గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులతో భక్తులు వాగ్వివాదానికి దిగారు.