అహ్మదాబాద్ లో దాయాదిని దంచికొడుతున్న టీమిండియా
- వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్థాన్
- నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
- పాక్ ను 191 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్
- 21 ఓవర్లలో 154 పరుగులు చేసి విజయానికి చేరువైన రోహిత్ సేన
- బౌండరీల వర్షం కురిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. పాక్ ను 191 పరుగులకే కట్టడి చేసిన భారత్... లక్ష్యఛేదనలో దంచికొడుతోంది.
21 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 2 వికెట్లకు 154 పరుగులు కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుతంగా ఆడుతూ పరుగుల జోరు కొనసాగిస్తున్నాడు. అటు ఫోర్లు, ఇటు సిక్సర్లు సమంగా బాదుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 85, శ్రేయాస్ అయ్యర్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. 61 బంతులెదుర్కొన్న హిట్ మ్యాన్ 6 ఫోర్లు, 6 సిక్సులు సంధించాడు. టీమిండియా విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి.
అంతకుముందు, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 16, కోహ్లీ 16 పరుగులు చేశారు. గిల్ ను షహీన్ అఫ్రిది అవుట్ చేయగా, కోహ్లీని హసన్ అలీ పెవిలియన్ చేర్చాడు.