హమాస్ ఉగ్రదాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం: గాజాలో 1,324 భవనాలు నేలమట్టం, 2200 మంది మృతి
- ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజా అతలాకుతలం!
- 1300కు పైగా భవనాలు నేలమట్టమైనట్లు తెలిపిన ఐరాస మానవతా సంస్థ
- ఉత్తర గాజాలోని పాలస్తీనియన్లను తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు
తమపై హమాస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ దీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా దాదాపు నేలమట్టమైంది. వారం రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న వైమానిక దాడుల కారణంగా గాజాలో దాదాపు 1,300కి పైగా భవనాలు నేలమట్టమైనట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ ఓసీహెచ్ఏ తెలిపింది.
గాజా ప్రజా పనుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం నగరంలో 1,324 భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొంది. 5,540 హౌసింగ్ యూనిట్లు నామరూపాల్లేకుండా పోయాయని, మరో 3,743 నివాసాలు ఉపయోగపడని విధంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. మరో 55వేల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రతిదాడి నేపథ్యంలో గాజాలో 2,200 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 724 మంది చిన్నారులు ఉన్నారని పేర్కొంది. 8,771 మంది గాయపడినట్లు తెలిపింది.
ఉత్తర గాజాలోని పాలస్తీనియన్లు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేయడంతో వారు ప్రాణభయంతో వెళ్లిపోతున్నారు.