టీటీడీ వెబ్ సైట్ పేరు మారింది!

  • ఇప్పటివరకు టీటీడీ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in
  • ఇక నుంచి ttdevasthanams.ap.gov.in గా మార్పు
  • భక్తులు గమనించాలన్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. 

కాగా, గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీసేవాఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అయితే అప్పటికి అది టీటీడీ పేరిట స్వతంత్ర వెబ్ సైట్ గా ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ వెబ్ సైట్ ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరును కూడా మార్చారు. వన్ వెబ్ సైట్, వన్ యాప్ కాన్సెప్టులో భాగంగా ఈ మార్పు చేపట్టినట్టు టీటీడీ వెల్లడించింది.


More Telugu News