చంద్రబాబు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లు... డీఐజీ ఎలా చెబుతారు?: సీపీఐ రామకృష్ణ

  • చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదన్న రామకృష్ణ
  • ఆరోగ్యం బాగాలేదని చెబితే ఎగతాళిగా మాట్లాడటం ఏమిటని ప్రశ్న
  • నీటి పారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్యం బాగాలేదని చెబితే ఎగతాళిగా మాట్లాడటం ఏమిటన్నారు. అసలు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లని, కానీ డీఐజీ ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సు నిర్వహిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో దీనిని నిర్వహిస్తున్నారన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ ఢిల్లీలో ఉన్నారని, కానీ అడ్డుకోలేకపోయారన్నారు. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.


More Telugu News