ఆ టెక్కీ రూ.3 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు... ఎందుకంటే..!
- మాజీ మెటా ఉద్యోగి రూ.3 కోట్ల ఉద్యోగాన్ని వదులుకున్న వైనం
- పని చేస్తోన్న సమయంలో పానిక్ అటాక్స్ రావడంతో వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ కాకపోయినట్లు వెల్లడి
- పలుమార్లు పానిక్ అటాక్ రావడంతో ఉద్యోగం వదిలేసినట్లు స్పష్టీకరణ
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తుంది. ఇటీవల బ్లైండ్ నుంచి వచ్చిన డేటా ప్రకారం ఇతర కంపెనీల కంటే గూగుల్, మెటా కంపెనీలు తమ ఉద్యోగులకు అధిక వేతనాలు ఇస్తున్నాయి. అయితే కొంతమందికి భారీ వేతనాలు మాత్రమే ఉంటే సరిపోదు.. ఇతర ఆలోచనలూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మెటా ఉద్యోగి ఏడాదికి రూ.3 కోట్ల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. జీతం భారీగా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగం తనకు సరిపోదనే వదిలేసినట్లు చెప్పాడు. మెటాలో పని చేస్తోన్న సమయంలో పానిక్ అటాక్స్ రావడం, పని గంటల తర్వాత కూడా వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ కాలేకపోవడం వల్ల ఉద్యోగం మానేసినట్లు 28 ఏళ్ల టెక్కీ ఎరిక్ యు చెప్పాడు.
తన పని సంక్లిష్టమైనదని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నాడు. ఆ తర్వాత కూడా పని నుంచి డిస్‌కనెక్ట్ కాలేకపోయినట్లు చెప్పాడు. వీకెండ్స్‌లో పలుమార్లు పని చేసినా తన పనిని బాస్‌లు విమర్శించేవారన్నాడు. దీంతో ఆఫీస్‌లోనే తనకు పానిక్ అటాక్స్ వచ్చాయని, మూడేళ్ల క్రితం నవంబర్‌లో కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో తొలిసారిగా పానిక్ అటాక్ వచ్చిందన్నాడు. ఇలా పలుమార్లు జరగడంతో రూ.3 కోట్ల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పాడు. రియల్ ఎస్టేట్‌లో పని చేస్తున్నానని చెప్పాడు.