బంగ్లాదేశ్ టాపార్డర్ విఫలం... న్యూజిలాండ్ ముందు ఈజీ టార్గెట్
- వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × బంగ్లాదేశ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు
- హడలెత్తించిన కివీస్ పేసర్లు... ఓ దశలో 56 పరుగులకు 4 వికెట్లు డౌన్
- ఆదుకున్న ముష్ఫికర్, షకీబ్... కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా
వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో టాపార్డర్ విఫలం కావడంతో, బంగ్లాదేశ్ భారీ స్కోరు ఆశలు సాధ్యం కాలేదు.
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ (66), కెప్టెన్ షకీబల్ హసన్ (40) రాణించగా... లోయరార్డర్ లో మహ్మదుల్లా (41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లేకపోతే బంగ్లాదేశ్ మరింత తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది.
ఓపెనర్ లిట్టన్ దాస్ (0) డకౌట్ కాగా, యువ ఓపెనర్ టాంజిద్ హసన్ (16) క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. మెహెదీ హసన్ మిరాజ్ 30 పరుగులు చేశాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 7 పరుగులకే వెనుదిరిగాడు.
బౌల్ట్, ఫెర్గుసన్, మాట్ హెన్రీలతో కూడిన నాణ్యమైన పేస్ ను ఎదుర్కోవడంలో బంగ్లాదేశ్ తడబాటుకు గురైంది. ఆ జట్టు 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.
కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2, మిచెల్ శాంట్నర్ 1, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు.