పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించవద్దని కాంగ్రెస్ ఆదేశాలు

  • బీసీలకు పార్టీలో న్యాయం జరగడం లేదంటూ రాజీనామా చేసిన పొన్నాల
  • జనగామ టిక్కెట్‌ రాదనే అసంతృప్తితో రాజీనామా 
  • నేతలకు అధిష్ఠానం నుంచి అంతర్గత ఆదేశాలు 
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ అధిష్ఠానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పొన్నాల రాజీనామాపై నేతలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాపై ఏమాత్రం మాట్లాడవద్దని చెప్పింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండటమే కాకుండా, మంత్రిగా పని చేసిన పొన్నాల ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ నియోజకవర్గం టిక్కెట్‌ తనకు రాదనే అసంతృప్తితో ఆయన పార్టీని వీడినట్లుగా చెబుతున్నారు. ఈ టిక్కెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందంటున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీనియర్లకు అపాయింటుమెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని పొన్నాల ఆరోపణలు గుప్పించారు.


More Telugu News