ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాపై 6 వేల బాంబులు కురిపించిన ఇజ్రాయెల్
- ఏడో రోజుకు చేరుకున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
- ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి
- ప్రాణాలు కోల్పోయిన 27 మంది అమెరికన్ పౌరులు
- తమ పౌరుల కోసం చార్టర్ విమానాలను సిద్ధం చేస్తున్న అమెరికా
- ఇప్పటికే ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన భారత్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేడు ఏడో రోజుకు చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,300కు పెరిగింది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 1,500 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరువైపులా మరణించిన వారి సంఖ్య 2,800కు చేరింది. యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సరిహద్దుకు ట్యాంకులు, ఇతర సైనిక సంపత్తిని తరలిస్తోంది. ‘ఇది యుద్ధ సమయం’ అని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు పేర్కొనడం యుద్ధం మరింత తీవ్రరూప దాల్చే అవకాశం ఉందని చెప్పకనే చెబుతోంది.
ఇరు దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా చార్టర్ విమానాలను సిద్ధం చేస్తోంది. పాలస్తీనా మిలిటెంట్ల దాడిలో ఇప్పటి వరకు 27 మంది అమెరికన్లు మరణించారు. మరో 14 మంది జాడ కనిపించడం లేదు. ఇండియా కూడా తమ పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాపై 6 వేల బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.