జగన్ ఆలోచన అదేనన్న చినరాజప్ప!
- చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారన్న చినరాజప్ప
- అందుకే బెయిల్ రాకుండా చేస్తున్నారని వ్యాఖ్య
- అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. అందుకే ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో ఓ గుమాస్తా అని, అన్ని శాఖలకు ఆయనే ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, అప్పటి నుంచి అన్నీ తప్పుడు కథనాలు అల్లుతున్నారన్నారు.
తన నియోజక వర్గంలో చేపడుతున్న ప్రారంభోత్సవాలకు తనకు ఆహ్వానమే లేదన్నారు. జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వస్తుంటే టీడీపీ నేతలను అరెస్ట్ చేయడమేమిటన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో తమ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయడం, పరదాలు కప్పడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం సాధారణంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.