నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 64 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు... ఆ వెంటనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 66,408కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 19,794 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.60%), ఎన్టీపీసీ (1.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.18%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.82%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.73%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.72%), ఇన్ఫోసిస్ (-1.95%), టీసీఎస్ (-1.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.74%), బజాజ్ ఫైనాన్స్ (-1.03%).


More Telugu News