లోకేశ్ వెళ్లేసరికి పురందేశ్వరి, కిషన్ రెడ్డి అప్పటికే అక్కడున్నారు: అచ్చెన్నాయుడు
- ఢిల్లీలో అమిత్ షాను కలిసిన నారా లోకేశ్
- ఆ సమయంలో లోకేశ్ తో పాటు దర్శనమిచ్చిన పురందేశ్వరి, కిషన్ రెడ్డి
- అమిత్ షాతో లోకేశ్ భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదన్న అచ్చెన్నాయుడు
- ఏపీ పరిస్థితులను వివరించేందుకే అమిత్ షాను లోకేశ్ కలిశారని వెల్లడి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే, అమిత్ షాతో లోకేశ్ భేటీ సమయంలో అక్కడ ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండడం చర్చనీయాంశం అయింది.
దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. అమిత్ షాను కలిసేందుకు లోకేశ్ వెళ్లేసరికి పురందేశ్వరి, కిషన్ రెడ్డి అప్పటికే అక్కడున్నారని వివరించారు. అంతేతప్ప లోకేశ్... పురందేశ్వరి, కిషన్ రెడ్డిలతో కలిసి వెళ్లి అమిత్ షాతో భేటీ కాలేదని అన్నారు.
అమిత్ షాతో లోకేశ్ సమావేశం వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో వివరించేందుకే అమిత్ షాను లోకేశ్ కలిశారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.